Pushpa | సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం పుష్ప. ఈ సినిమా సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో బన్నీ నటనకి ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. ఇక పుష్ప చిత్రం మంచి విజయం సాధించడంతో ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప2 తీసాడు సుకుమార్. ఈ మూవీ భారీ విజయం సాధించింది. పుష్ప 2: ది రూల్ గత ఏడాది డిసెంబర్ 5న విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలై మంచి అప్లాజ్ అందుకుంది.
పుష్ప చిత్రం విడుదలై చాలా రోజులే అవుతున్నా ఆ ఫీవర్ తగ్గడం లేదు. ఎక్కడో ఒక చోట మనకు పుష్ప హంగామా కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా బీహార్‌లో కొందరు కుర్రాళ్లు అల్లు అర్జున్ తరహాలో తగ్గేదే లే అంటూ రోడ్లపైన తెగ హంగామా చేశారు. మ్యూజిక్ పెట్టుకొని అందరు కూడా పుష్ప స్టైల్లో రచ్చ చేస్తుంటే చుట్టు పక్కల వారు వారిని అదే విధంగా చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోపై బన్నీ అభిమానులు అయితే క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ క్రేజ్ అంటే ఇలానే ఉంటది మరీ అని అంటున్నారు.
పుష్ప 2 కథలో పుష్పరాజ్- భన్వర్ సింగ్ షెఖావత్ (ఫహాద్ ఫాజిల్) మధ్య సీన్స్ ఉత్కంఠని పెంచాయి. భారీ యాక్షన్ సన్నివేశాలు, చక్కటి డైలాగ్స్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా… ఫ్లవర్ కాదు..’ అనే డైలాగ్ ఒకటి, తగ్గేదే లే అనే డైలాగ్ మాత్రం ఇప్పటికీ చాలా మంది నోళ్లలో నానుతూ ఉంది. ఇక బన్నీ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా బన్నీ స్థాయిని మరింత పెంచనుందని అంటున్నారు. ఇప్పటికే అన్నీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తైనట్టు తెలుస్తుండగా, త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నారు.
Actual meaning of ground level Reach.
B grade saruku ruling Bihar rurals#Pushpa2TheRule pic.twitter.com/MYNUXiqpGU
— RetiredFan (@kaali_102) August 9, 2025