Allu Arjun – Sukumar | టాలీవుడ్ నుంచి వస్తున్న మెస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాలలో పుష్ప 2 ఒకటి. బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప: ది రైజ్’ కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ విడుదల దగ్గర పడుతున్న ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమా విడుదలకు 09 రోజులు కూడా లేకపోవడంతో షూటింగ్ ఇంకెప్పుడు పూర్తి అవుతుందని అటు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్‌కు టెన్షన్ నెలకొంది.
అయితే ఈ టెన్షన్‌ను పోగొడుతూ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యిందని తాజాగా అల్లు అర్జున్ వెల్లడించారు. చివరి రోజు పుష్ప 2 చివరి షాట్. పుష్ప యొక్క 5 సంవత్సరాల ప్రయాణం పూర్తయింది. ఎంతటి సుదీర్ఘ ప్రయాణం అంటూ అల్లు అర్జున్ రాసుకోచ్చాడు. ఈ సందర్భంగా మూవీ షూటింగ్ నుంచి ఒక ఫొటోను విడుదల చేశాడు.
LAST DAY LAST SHOT OF PUSHPA . 5 years JOURNEY of PUSHPA completed . What a journey 🖤 pic.twitter.com/eQoRhcLFMQ
— Allu Arjun (@alluarjun) November 26, 2024