BBTeluguGrandFinale | బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో ఉన్న టాప్ 5 ఫైనలిస్టుల్లో సిరి ముందుగా ఎలిమినేట్ అయిపోయింది. సిరి ఎలిమినేషన్‌కు ముందు పుష్ప టీమ్ బిగ్ బాస్ స్టేజ్ మీద అలరించింది. పుష్ఫ డైరెక్టర్ సుకుమార్‌తో పాటు హీరోయిన్ రష్మిక, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అతిథులుగా వచ్చారు. అయితే.. రష్మిక, దేవిశ్రీప్రసాద్.. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి టాప్ 5 కంటెస్టెంట్లలో ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్ సిరిని తీసుకొని బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చారు.
సిరి ఎలిమినేషన్లో భాగంగా బిగ్ బాస్ ఒక గేమ్‌ను ప్లే చేశాడు. బిగ్ బాస్ హౌస్ మీద 5 డ్రోన్స్ తిరిగాయి. ఒక్కో డ్రోన్ మీద ఒక్కొక్క కంటెస్టెంట్ ఫోటోను ఏర్పాటు చేశారు. ఒక్క డ్రోన్ మాత్రం హౌస్ నుంచి బయటికి వెళ్లిపోతుంది. అది సిరి డ్రోన్. దీంతో సిరి ఎలిమినేషన్ కన్ఫమ్ అయిపోయింది.
దీంతో ఈసారి టైటిల్ కూడా పురుషులకే కన్ఫమ్ అయిపోయింది. ఎందుకంటే.. మిగిలిన మిగితా నలుగురు కంటెస్టెంట్లు మగవాళ్లే. బిగ్ బాస్ మిగితా నాలుగు సీజన్లలోనూ విన్నర్లు పురుషులే కావడం గమనార్హం.