అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప.భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తుండగా, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించారు. ఈ సినిమా తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ పేరుతో డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిత్ర రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక టీజర్, మూడు సింగిల్స్ విడుదలకాగా.. అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ఇక దీపావళికి మరో టీజర్ తో అభిమానులకు స్పెషట్ ట్రీట్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ‘పుష్ప’ టీజర్ ను కట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు దర్శకుడు సుకుమార్.
ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న చిత్రంలో పుష్ఫరాజ్ అనే స్మగ్లర్‌గా అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక కనిపించనుంది. ఈసినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం హైలైట్ కాబోతోంది. మరి ఈ దీపావళి టీజర్ లోని ప్రత్యేకత ఏంటో మరి కొద్ది రోజులలో తేలనుంది.