e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News Pushpa: బ‌న్నీ కెరియ‌ర్‌లోనే భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న పుష్ప‌

Pushpa: బ‌న్నీ కెరియ‌ర్‌లోనే భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న పుష్ప‌

అల్లు అర్జున్,ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రం పుష్ప‌. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీని రెండు పార్ట్స్‌గా విడుదల చేస్తుండగా.. మొదటి భాగం డిసెంబర్‌ 17న విడుదల కానుంది. పాన్ ఇండియన్ లెవెల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఒక్క ఇండియాలోనే ఈ సినిమాని గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తుండటమే కాకుండా ఓవ‌ర్సీస్‌లోను భారీ స్థాయిలో విడుద‌ల చేసేందుకు ప్ర‌ణాళిక‌లు చేస్తున్నారు.

యూఎస్ మార్కెట్ లో ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో కూడా హంసిని ఎంటర్టైన్మెంట్స్ అలాగే క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్‌ రిలీజ్ గా ఈ చిత్రం ఉంటుంది అని తెలుస్తుంది. అలాగే డిసెంబర్ 16 నుంచే ప్రీమియర్స్ తో ఈ చిత్రం అక్కడ రచ్చ స్టార్ట్ చేయనుంది. ఈ భారీ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా రెండు భాగాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement