Open School | ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు అక్టోబర్‌లో నిర్వహించనున్నట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) డైరెక్టర్ కే లింగయ్య గురువారం ఓ ప్రకటన (Press note)లో తెలిపారు. ఈ పరీక్షల ఫీజును http://www.telanganaopenschool.org వెబ్సైట్లో లేదా టీజీ ఆన్లైన్/మీ సేవ సెంటర్లలో చెల్లించాలని కోరారు. గత ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల్లో పాస్ కాని వారు, గతంలో ఫీజు చెల్లించి పరీక్షలు రాయనివారు మళ్లీ ఫీజు చెల్లించి పరీక్షలు రాయవచ్చు.
ఫీజు వివరాలు
పరీక్ష ఫీజు ఎలాంటి ఫైన్ లేకుండా ఆగస్టు 1 నుంచి 17 లోగా, పేపర్‌కు రూ. 25 చొప్పున ఫైన్‌తో ఆగస్టు 18 నుంచి 24లోగా, పేపర్‌కు రూ. 50 చొప్పున ఫైన్‌లో ఆగస్టు 25 నుంచి 29 లోగా, తల్కాల్ అయితే ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2 లోగా చెల్లించాలి. పరీక్షల టైమ్‌టేబుల్ కోసం వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. చలానా/డీడీ చెల్లింపులకు అనుమతిలేదు. సెలవు రోజుల్లో ఫీజు తీసుకోరు.