అమరావతి : ఏపీలోని శ్రీకాకుళం జైలు( Jail ) లో రిమాండ్లో ఉన్న వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ( Sidiri Appala Raju ) ను పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ( Jagan ) కు నిరాశే ఎదురయ్యింది . జైలులో అప్పలరాజును కలిసేందుకు సాయంత్రం 5 గంటలలోగా రావాల్సి ఉండగా సమయం మించిపోవడంతో నిబంధనల ప్రకారం ములాకాత్ రద్దయ్యింది. దీంతో జగన్ జైలు బయటే సీదిరి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
విమానంలో విజయవాడ నుంచి విశాఖకు చేరుకున్న జగన్ కారులో శ్రీకాకుళం జిల్లాకు బయలు దేరారు. దాదాపు నాలుగు గంటలకు పైగా దారిపొడవునా ప్రజలు స్వాగతం పలికారు. పలు చోట్ల కాన్వాయ్ దిగి ప్రజలతో ముచ్చటించారు. దీంతో జైలుకు ఆలస్యంగా చేరుకున్నారు.