అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం దేశవ్యాప్తంగా అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా స్టార్‌గా తిరుగులేని గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమా ద్వారా ఆయన ఉత్తరాది ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. దీంతో ‘పుష్ప-2’ కోసం సినీ ప్రియులు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్‌మీదకు రానున్న విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 22న హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిసింది.
‘పుష్ప’ చిత్రంలో ఎర్రచందనం స్మగ్లర్‌గా అల్లు అర్జున్ రగ్గ్డ్, మాస్ లుక్ అందరిని ఆకట్టుకుంది. సీక్వెల్లో కూడా కొద్ది మార్పులతో అదే లుక్‌ను కొనసాగిస్తారని చెబుతున్నారు. ఇటీవలే అల్లు అర్జున్ లుక్ టెస్ట్‌కు హాజరయ్యారని, బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ మేకప్ ఆర్టిస్టు, ప్రోస్థటిక్ లుక్ డిజైనర్ నేతృత్వంతో లుక్ టెస్ట్ జరిగిందని తెలిసింది. సీక్వెల్ కోసం దర్శకుడు సుకుమార్ సరికొత్త హంగులతో కథను సిద్ధం చేశారని, తొలి భాగం తరహాలోనే వెండితెరపై సీక్వెల్ కూడా మ్యాజిక్‌ను క్రియేట్ చేస్తుందని అంటున్నారు.