Pushpa 2 The Rule | మరో 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సందడి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 05 విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అవ్వగా.. విడుదల చేసిన ట్రైలర్‌తో పాటు కిస్సిక్ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఇదిలావుంటే ఈ సినిమా రన్‌టైంకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పుష్ప రన్ టైం దాదాపు 3.21 గంటలు అని తెలుస్తుంది. ఇందులో ఫస్ట్ ఆఫ్ 1.40 నిమిషాలు, సెకండ్ ఆఫ్ 1.51 నిమిషాలు అని తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ మధ్య వచ్చిన సినిమాలలో ఇదే అత్యధిక రన్‌టైంతో వచ్చిన సినిమాగా రికార్డులకెక్కుతుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.