Pushpa Kunrin | ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘పుష్పరాజ్’ ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. జనవరి 16న జపాన్‌లో ‘పుష్ప 2: ది రూల్’ భారీ స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో, ఈ చిత్ర ప్రమోషన్ల కోసం బన్నీ స్వయంగా రంగంలోకి దిగారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి జపాన్ రాజధాని టోక్యోకు చేరుకున్నారు. సోమవారం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి కనిపించిన బన్నీ నేడు టోక్యో చేరుకున్నట్లు తెలుస్తుంది. టోక్యోలోని తన హోటల్ గది నుంచి నగర అందాలను చూపిస్తూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సినిమా విషయానికి వస్తే.. జపాన్ పంపిణీ సంస్థలు ‘గీక్ పిక్చర్స్’, ‘షోచికూ’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేస్తున్నాయి. జపాన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను అక్కడ ‘పుష్ప కున్రిన్’ (Pushpa Kunrin) అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రష్మిక మందన్న ‘జాతర’ ఎపిసోడ్ మరియు ఫహాద్ ఫాసిల్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ జపాన్ ఆడియన్స్‌ను కూడా మెప్పిస్తాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే గ్లోబల్ వైడ్ వైరల్ అయ్యాయి. డిసెంబర్ 5, 2024న భారత్‌లో ఐదు భాషల్లో విడుదలైన ‘పుష్ప 2’, ఇప్పటికే సంచలన వసూళ్లతో ‘ఇండస్ట్రీ హిట్’గా నిలిచింది. ఇప్పుడు జపాన్ మార్కెట్‌ను కూడా కొల్లగొట్టడం ద్వారా ఇండియన్ సినిమా ఖ్యాతిని మరింత పెంచాలని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
LATEST 🚨: #AlluArjun has reached Tokyo & is all set to promote the INDIAN INDUSTRY HIT #Pushpa2 in Japan ❤️🔥#Pushpa2inJapan #AA22 pic.twitter.com/beWGvHctep
— sunny (@Bhanu90590) January 13, 2026