Pushpa 2 The Rule | అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa The Rule). సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక కథానాయిక నటించింది. డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా రూ.1760 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మరికొన్ని రోజుల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన బాహుబలి(రూ.1804 కోట్ల) సినిమా రికార్డును కూడా ఈ చిత్రం అధిగమించనుంది.
ఇదిలావుంటే.. ఈ మూవీ నుంచి ఫుల్ వీడియో సాంగ్‌లను చిత్రబృందం ఒక్కొక్కటిగా వదులుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘పుష్ప రాజ్’(Pushpa RAj Title Song) సాంగ్‌తో పాటు ‘కిస్సిక్’(Kissik), దమ్ముంటే పట్టుకోరా షెకావత్ (Dammunte Pattukora Shekawat), సూసేకి.. అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి(Sooseki), సాంగ్‌లను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ‘గంగో రేణుక తల్లి’(Gango Renuka Thalli) జాతర వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. ఈ జాతర ఎపిసోడ్లో అల్లు అర్జున్ మాస్ తాండవం చేశాడు. దాదాపు 30 నిమిషాలకు పైగా ఉన్న ఈ సీన్ బన్నీ కెరీర్‌కు హైలెట్‌గా నిలిచింది. ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించగా.. మహాలింగం పాడాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. థియేటర్లో ఉర్రుతలు ఊగించిన ఈ సాంగ్‌ను మీరు కూడా చూసేయండి.