Pushpa 2: The Rule | టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా వసూళ్లలో రికార్డులు నెలకొల్పుతోంది. థియేటర్లలో రిలీజైన 10 రోజుల్లోనే రూ.1,292 కోట్లు రాబట్టిందని సినిమా నిర్మాతలు ఆదివారం తెలిపారు. ఇందులో కేవలం బాలీవుడ్ లోనే రూ.507.50 కోట్లు వసూలు చేసింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తెలుగు సినిమా ‘పుష్ప2: ది రూల్’ ను హిందీ, తమిళం, కన్నడం, బెంగాలీ, మలయాళం భాషల్లో డబ్బింగ్ చేశారు. ఈ సినిమాలో రష్మిక మందాన, ఫహధ్ ఫాసిల్ కూడా నటించారు. 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా ‘పుష్ప’కు స్వీకెల్ ‘పుష్ప2: ది రూల్’.
ఈ నెల ఐదో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైందీ పుష్ప2: ది రూల్ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. సినిమా బాక్సాఫీసు వసూళ్లపై మైత్రీ మూవీ మేకర్స్ ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా పోస్ట్ చేశారు. స్థూలంగా 2024 భారత సినిమా వసూళ్లలో ఇది అత్యధికం అని పేర్కొన్నారు. #పుష్ప2 ది రూల్ సినిమా రిలీజైన 10 రోజుల్లోనే రూ.1292 కోట్ల వసూళ్లతో రికార్డు సాధించింది అని తెలిపారు. #2024 హయ్యర్ గ్రాసర్ పుష్ప2, #పుష్ప2, #వైల్డ్ ఫైర్ పుష్ప, #ఐకాన్ స్టార్ @ అల్లు అర్జున్, # దిసీజ్ డీఎస్పీ,#సుకుమార్ రైటింగ్స్, #మైత్రీ అఫిషియల్ తదితర ట్యాగ్స్ జత చేసింది.