Pushpa 2 The Rule Breaks Sharukh Record | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన క్రేజీ సీక్వెల్ పుష్ప 2 ది రూల్(Pushpa 2 The Rule) బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. ఈ సినిమా హిందీలో తాజాగా షారుఖ్ ఖాన్ జవాన్(Jawan) పేరిటా ఉన్న రికార్డును బద్దలుకొట్టింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 12000 వేలకు పైగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.
హిందీలో కూడా ఇప్పటివరకు ఏ తెలుగు హీరో సినిమా విడుదల కానీ రేంజ్లో ఈ చిత్రం విడుదలైంది. అయితే ఈ సినిమా హిందీ బెల్ట్‌లో మొదటి రోజు షారుఖ్ ఖాన్ జవాన్ రికార్డులను అధిగమించింది. జవాన్ సినిమా ఫస్ట్ డే రూ.65 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా.. తాజాగా ఈ రికార్డును అల్లు అర్జున్ అధిగమించాడు. హిందీలో పుష్ప 2 చిత్రం మొదటి రోజు రూ.72 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. హిందీలో టికెట్ రేట్లు కూడా పెంచకపోవడంతో సినిమా చూడడానికి ఎగబడుతున్నారు జనాలు.
HISTORY MADE in INDIAN CINEMA ❤🔥#Pushpa2TheRule is HIGHEST DAY 1 OPENING HINDI FILM EVER with a Nett of 72 CRORES 💥💥💥#RecordsRapaRapAA 🔥
RULING IN CINEMAS
Book your tickets now!
🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/0Ed23geibT
— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024