Pushpa 2 The Rule Thank You Meet | పుష్ప 2 సినిమాతో ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమా విజయంతో పాటు పలు వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే. పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కసలాటలో ఒక మహిళ చనిపోగా.. ఈ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటికి వచ్చాడు. అయితే ఆ ఘటన అనంతరం మీడియా ముందుకు రావడం చాలా తగ్గించాడు అల్లు అర్జున్. ఇటీవల నాగచైతన్య నటించిన తండేల్ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే వ్యక్తిగత కారణాల వలన ఈ సినిమా ఈవెంట్‌కి హాజరుకాలేకపోయాడు. దీంతో పుష్ప 2 ఎఫెక్ట్ వలన అల్లు అర్జున్ సినిమా ఈవెంట్లకి.. మీడియా ముందుకి రావడం తగ్గించాడు అని టాక్ బయటకు వచ్చింది. అయితే ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కి సంబంధించి సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది.
పుష్ప 2 ది రూల్ వరల్డ్ వైడ్‌గా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంతటి ఇండస్ట్రీ హిట్ సాధించిన సందర్భంగా చిత్రబృందం నేడు సాయంత్రం థాంక్యూ మీట్ నిర్వహించబోతుంది. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్రబృందం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అయితే నేడు అల్లు అర్జున్ మీడియా ముందుకు రాబోతుండడంతో ఏం మాట్లాడతాడా అని అటు ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
An evening to celebrate INDIAN CINEMA’S INDUSTRY HIT ✨❤️🔥#Pushpa2TheRule THANK YOU MEET today from 5 PM onwards 🤩
Stay tuned!
▶️https://t.co/dejohY0mJk#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @resulp @NavinNooli… pic.twitter.com/EGfZ1Wkug1
— Pushpa (@PushpaMovie) February 8, 2025