సుకుమార్ (Sukumar), అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్ లో వచ్చిన పుష్ప బాక్సాపీస్ ను ఏ రేంజ్లో షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్రేజీ కాంబోలో సీక్వెల్ పుష్ప 2 (Pushpa 2) కూడా రెడీ అవుతుందని తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఇంట్రెస్టింగ్ స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. ఈ స్టిల్‌తో పుష్ప 2 ట్రాక్‌పైకి ఎక్కినట్టేనని కన్ఫామ్ అయిపోయింది. పాటల రచయిత చంద్రబోస్, డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఒక్క చోట చేరారు.
#Pushpa 2తో ఈ స్టిల్ ట్రెండింగ్ అవుతుండటంతో ఈ ముగ్గురూ పుష్ప 2 మ్యూజిక్ సిట్టింగ్స్ తో బిజీగా ఉన్నట్టు తెలిసిపోతుంది. మరి దీనిపై మేకర్స్ నుంచి ఏదైనా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు. సీక్వెల్లో కూడా కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఫీ మేల్ లీడ్ రోల్లో మెరవనుంది. ఫస్ట్ పార్టులాగే పుష్ప 2 కూడా తెలుగు, తమిళం, మలయాళం, హిందీతోపాటు పలు భాషల్లో సందడి చేయనుంది. త్వరలోనే పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లనున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్.
సెకండ్ పార్టులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీ రోల్లో కనిపించబోతున్నాడని టాక్ నడుస్తుండగా..దీనికి సంబంధించిన అప్ డేట్ రావాల్సి ఉంది. రష్మిక ప్రస్తుతం విజయ్‌తో కలిసి వారసుడు సినిమాతో బిజీగా ఉంది. మరోవైపు బాలీవుడ్ యాక్టర్ రణ్ బీర్ కపూర్‌తో కలిసి యానిమల్ (Animal) లో కూడా నటిస్తోంది.