Pushpa 2 Kissik | మరో 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సందడి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌తో పాటు పాటలు విడుదల చేయగా.. రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. ఇదిలావుంటే మూవీ నుంచి ఐటం సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. కిస్సిక్ అంటూ ఈ సాంగ్ రాబోతుండగా.. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఆ అంటే అమలాపురం, రింగ రింగా, ఊ అంటావా మావ సాంగ్‌లను మీంచి ఈ పాట ఉండబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఫుల్ సాంగ్‌ను నవంబర్ 24న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది.