‘అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప-2’ చిత్రంపై రోజురోజుకి అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ‘హంట్ ఫర్ పుష్ప’ అంటూ కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో రికార్డు వీక్షణలతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అందు లో పుష్పరాజ్ పాత్రను ప్రజెంట్ చేసిన విధానం అభిమానుల్ని మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తున్నది. ఇందులో ఇంటర్వెల్ ఎపిసోడ్ ఊహించని మలుపులతో సాగుతుందని, రష్మిక మందన్న పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుందని అంటున్నారు. ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను దర్శకుడు సుకుమార్ అద్భుతంగా తీర్చిదిద్దారని, సినిమాలో అదే హైలైట్‌గా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది.