Pushpa 2 Glimpse | అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ సినిమా జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించింది. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్లో రికార్డు స్థాయి వసూళ్లు దక్కించుకుంది. తొలి భాగం క్రేజ్‌తో ద్వితీయ చిత్రం ‘పుష్ప 2’ కోసం సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రష్మిక మందన్న నాయికగా నటిస్తున్నది.
‘వేర్ ఈజ్ పుష్ప’, ‘హంట్ బిఫోర్ రూల్’ అంటూ తాజాగా ఈ సినిమా నుంచి అనౌన్స్మెంట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీన ఈ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప, అతను ఎక్కడ..’ అంటూ టీవీ బ్రేకింగ్ న్యూస్ గ్లింప్స్‌లో వినిపించింది. పోలీస్ డౌన్ డౌన్ అంటూ నిరసనలు చేస్తున్న దృశ్యాలూ చూపించారు. పుష్ప ఎక్కడ అంటూ సాగిన ఈ అనౌన్స్మెంట్ గ్లింప్స్ ఆసక్తిరేపింది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నది.