Cyclone Arnab | గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. రేపు ఉదయం తీరాన్ని తాకే ఛాన్స్..!
Cyclone Arnab | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అర్నబ్ (Cyclone Arnab)’ తీరంవైపు దూసుకొస్తోంది. గత 6 గంటలుగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా ముందుకు కదులుతోంది. ఈ విషయాన్ని భారత వాతావరణశాఖ కేంద్రం వెల్లడించింది. తుపాను ప్రభావంలో తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
Cyclone Arnab : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అర్నబ్ (Cyclone Arnab)’ తీరంవైపు దూసుకొస్తోంది. గత 6 గంటలుగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా ముందుకు కదులుతోంది. ఈ విషయాన్ని భారత వాతావరణశాఖ కేంద్రం వెల్లడించింది. తుపాను ప్రభావంలో తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు అంతెత్తున ఎగిసిపడుతున్నాయి. తీరానికి చేరువైనాకొద్ది తుపాను వేగం మరింత పెరుగుతున్నది.
తుపాను ప్రస్తుతం విశాఖపట్నానికి ఆగ్నేయంగా 220 కిలోమీటర్లు, కాకినాడకు 240 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 340 కిలోమీటర్లు, బాపట్లకు 410 కిలోమీటర్ల, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 370 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. బుధవారం ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరందాటే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా యానాం వద్ద తీరందాటే సూచనలు ఉన్నాయని పేర్కొన్నది.
తుపాను తీరందాటే సమయంలో గంటకు 125-135 కిలోమీటర్ల వేగంతో గరిష్ఠంగా 150 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు.. లక్షణాలను ముందే గుర్తిస్తే చికిత్స సులభం..
Cyclone Arnab | గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. రేపు ఉదయం తీరాన్ని తాకే ఛాన్స్..!
‘రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి’
‘నిరుద్యోగుల గొంతుక వినిపించేది బీఆర్ఎస్ పార్టీనే’
హెలికాప్టర్ మంత్రులకు నీళ్ల సోయి లేదు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

