హెలికాప్టర్ మంత్రులకు నీళ్ల సోయి లేదు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
రాష్ట్రంలో వచ్చిన కరువు ఎల్ నినో వల్ల కాదని, అది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నీళ్ల సోయి లేక కరెంట్ ఇయ్యలేని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని స్కామ్ ల తోనే రాష్ట్ర పాలన..
– దేవరకొండలో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం
– బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపు
దేవరకొండ, అక్టోబర్ 27 : రాష్ట్రంలో వచ్చిన కరువు ఎల్ నినో వల్ల కాదని, అది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నీళ్ల సోయి లేక కరెంట్ ఇయ్యలేని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని స్కామ్ ల తోనే రాష్ట్ర పాలన సాగుతుందన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని సాయి శివ ఫంక్షన్ హాల్లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. కన్నెపల్లి పుంపు హౌస్ నుండి నీళ్లు తెచ్చే సోయి లేదు. డిండి ప్రాజెక్టు కింద రైతుల పంటలు ఎండిపోతుంటే ఇక్కడ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు పట్టింపు లేదు. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంట్ ఇపుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదో సమాధానం చెప్పాలి. కనీసం నీళ్లు ఎక్కడ నుండి తేవాలో కూడా తెలియని దద్దమ్మలు ఉన్నారని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అన్ని స్కామ్ లే తప్పా స్కీమ్ లు లేవన్నారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్‌ను కోరుకుంటున్నారన్నారు. మళ్లీ కేసీఆర్ సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. రాబోయే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలన్నారు. అర్హత ఉండి నమోదు కానీ వారిని ఓటరుగా నమోదు చేయించాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, రాకేష్ రెడ్డి, చింతల వెంకటేశులు, బిల్యానాయక్, కిషన్ నాయక్, రమేష్ నాయక్, వెంకట్ రెడ్డి, వల్లపు రెడ్డి, టీవీఎన్ రెడ్డి, ఆంజనేయులు, లోక్య నాయక్, శంకర్ నాయక్, సర్వయ్య, రవి, రాజు, కృష్ణ, రమేష్, చిరంజీవి, వెంకటేశ్వర్ రావు, దస్రూ నాయక్, రాజవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గోపాల్ గౌడ్ ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
హెలికాప్టర్ మంత్రులకు నీళ్ల సోయి లేదు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
NZvIND: అభిషేక్ 113, వైభవ్ 45.. మూడో టీ20లో ఇండియా విజయం
Drinking Water Pipeline | ఓబులాపూర్‌లో డ్రైనేజీలో తాగునీటి పైపులైన్.. అధికారులు ప్రమాదం జరిగాకే స్పందిస్తారా..?
MK Stalin | బ్రేకింగ్ బ్యాడ్, ప్రిజన్ బ్రేక్.. విజయ్ సర్కారుపై మాజీ సీఎం స్టాలిన్ సెటైర్లు..!
పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో పోచంపల్లి నిఫ్ట్ డిజైనర్ తడక వైష్ణవి చేనేత స్టాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

