‘రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి’
రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. గౌరవ వేతనం, కమీషన్ పెంపుతో పాటు రేషన్ షాపులకు ఉచితంగా సరుకుల రవాణా, తూకంలో బియ్యం సరఫరా తదితర సమస్యలను...
– గౌరవ వేతనం రూ.5 వేలు, క్వింటాల్‌కు రూ.300 కమీషన్ ఇవ్వాలి
– నల్లగొండ గడియారం సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ
రామగిరి, అక్టోబర్ 27 : రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. గౌరవ వేతనం, కమీషన్ పెంపుతో పాటు రేషన్ షాపులకు ఉచితంగా సరుకుల రవాణా, తూకంలో బియ్యం సరఫరా తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డీలర్లు నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఏవో మోతీలాల్‌కు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి రేషన్ డీలర్‌కు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం, క్వింటాల్‌కు రూ.300 కమీషన్ చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఫుడ్ సెక్యూరిటీ చట్టం ప్రకారం రేషన్ దుకాణాల వద్దకే సరుకులను ఉచితంగా రవాణా చేసి అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని కోరారు. గోదాముల నుంచి రేషన్ షాపులకు సరఫరా చేసే బియ్యాన్ని ఖచ్చితమైన తూకంతో అందించాలని డిమాండ్ చేశారు. గత 20 నెలలుగా దొడ్డు బియ్యం నిల్వలు రేషన్ దుకాణాల్లోనే ఉండిపోవడంతో డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో క్వింటాల్ బియ్యంపై 10 శాతం తరుగు సడలింపు కల్పించాలని కోరారు.
బియ్యం నిల్వలు, తరుగు తదితర కారణాలతో డీలర్లపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పొరెపల్లి నాగరాజు, జిల్లా కోశాధికారి కోటగిరి సూర్యనారాయణ, మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షుడు పగిళ్ల వెంకటేశ్వర్లు, దేవరకొండ డివిజన్ అధ్యక్షుడు కొర్ల శంకర్ నాయక్, నల్లగొండ డివిజన్ అధ్యక్షుడు మీ సత్తిరెడ్డి, బొల్లా వేణుగోపాలరావు, సముద్రాల యాదయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి’
‘నిరుద్యోగుల గొంతుక వినిపించేది బీఆర్ఎస్ పార్టీనే’
హెలికాప్టర్ మంత్రులకు నీళ్ల సోయి లేదు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
NZvIND: అభిషేక్ 113, వైభవ్ 45.. మూడో టీ20లో ఇండియా విజయం
Drinking Water Pipeline | ఓబులాపూర్‌లో డ్రైనేజీలో తాగునీటి పైపులైన్.. అధికారులు ప్రమాదం జరిగాకే స్పందిస్తారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

