Puri – Vijay | మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, పూరీ జగన్నాథ్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కబోతోన్న విషయం మనందరికి తెలిసిందే. కొన్నాళ్లుగా పూరీ జగన్నాథ్ మంచి సక్సెస్ కోసం ఎంతో కష్టపడుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ జాబితాలో ఒక్క హిట్ లేదు. దీంతో ఇప్పుడు విజయ్ సేతుపతితో కలిసి అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచీ మూవీపై భారీ హైప్ అయితే క్రియేట్ అవుతోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే పలు సందర్భాల్లో పూరి చెప్పుకొచ్చారు.
విజయ్ సేతుపతి తాజా చిత్రం “తలైవన్ తలైవి (సర్ మేడం )” తమిళంలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ పొందుతోంది. దీంతో హైదరాబాద్‌లో పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ ఆధ్వర్యంలో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకలో విజయ్ సేతుపతి సహా సినిమాకు సంబంధించిన బృందం పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రేషన్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా వేదికగా మూవీ టీం పంచుకుంటూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇప్పటికే బ్లాక్ బస్టర్ వైబ్స్ వచ్చేశాయి. మక్కల్ సెల్వన్ మ్యాజిక్‌ను టీం ఎంజాయ్ చేశాం. ఇది ఓ అద్భుతమైన ప్రారంభం. సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు ఉత్సాహంగా ఉంది అంటూ మేకర్స్ రాసుకొచ్చారు. జులై 1న పూజా కార్యక్రమాలతో మూవీ షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే.
కాగా, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై శరవేగంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్స్ కూడా త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ మూవీతో పూరీ మంచి హిట్ కొడతాడని చాలా ఆశతో ఉన్నారు ఆయన అభిమానులు..
Blockbuster vibes already💥
Team #PuriSethupathi celebrated the magic of our dearest Makkal Selvan @VijaySethuOffl’s #SirMadam – #ThalaivanThalaivii, which is off to a flying start💥
The excitement is sky-high to witness it on the big screens!@MenenNithya @pandiraaj_dir pic.twitter.com/QPCuMr6K2S
— Puri Connects (@PuriConnects) July 25, 2025