తమిళ అగ్రనటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ మధ్య ఈ సినిమా షూటింగ్ టైమ్‌లోని ఎమోషనల్ మూమెంట్స్‌కి చెందిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ సినిమా టీమ్‌ని తానెంత మిస్ అవుతున్నానో ఈ వీడియో ద్వారా విజయ్ సేతుపతి తెలియజేశారు. పూరీతో తనకేర్పడ్డ బాండింగ్‌ను ఆయన గుర్తుచేసుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, ప్రమోషన్స్‌లో భాగంగా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ని త్వరలోనే విడుదల చేస్తామని పూరి జగన్నాథ్ తెలిపారు.
సంయుక్త మీనన్, టబు, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, సమర్పణ: ఛార్మి కౌర్, నిర్మాతలు: పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల, నిర్మాణం: పూరి కనెక్ట్స్.