Puri Jagannadh | టాలీవుడ్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). పూరీజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది. మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం.
తాజాగా సినీ జనాలు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. మూవీ టికెట్స్ బుకింగ్స్ చేసుకునే టైం వచ్చేసింది. డబుల్ ధిమాకోడి మాస్ బరాత్ షురూ అయింది రో.. డబుల్ ఇస్మార్ట్ బుకింగ్స్ మొదలయ్యాయి. మీ టికెట్స్ బుక్ చేసుకొని.. పండగ చేస్కోండి.. అంటూ మేకర్స్ అదిరిపోయే వార్తను మూవీ లవర్స్‌తో షేర్ చేసుకున్నారు. ఇంకేంటి మరి డబుల్ ఇస్మార్ట్ టికెట్స్ బుక్ చేసుకోండి.
విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఆసక్తికర అప్డేట్ ఒకటి షేర్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని నైజాంలో ప్రైమ్ షో ఫిలిమ్స్ విడుదల చేస్తుండగా.. తమిళనాడులో పాపులర్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ శక్తి ఫిలిం ఫ్యాక్టరీ విడుదల చేస్తోంది. ఇప్పటికే ధిమాక్కిరికిరి డబుల్ ఇస్మార్ట్ టీజర్, ట్రైలర్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది.
Double Dhimaagodi Mass Baraat Shuru aindi rooo🤙#DOUBLEISMART BOOKINGS OPEN NOW 💥💥
Book Your Tickets Now & Enjoy… Pandagow 🥳
🎟️ https://t.co/NgNSZcO7BVMassive Release Worldwide On August 15th ❤️🔥#DoubleiSmartOnAug15
Ustaad @ramsayz @KavyaThapar #PuriJagannadh… pic.twitter.com/gG54LKHHrg
— Puri Connects (@PuriConnects) August 13, 2024
Ravi Teja | సుమ, భాగ్య వీళ్లే ఫొటో తీయండి.. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో రవితేజ
Committee Kurrollu | యదువంశీ కథకు జీవం పోశాడు.. కమిటీ కుర్రోళ్లు మూవీపై రాంచరణ్