Kangana Ranaut | మంగళసూత్రం ఫోటోలతో వైరల్ అయిన పెళ్లి వార్తలు.. అసలు నిజం చెప్పిన కంగనా రనౌత్
Kangana Ranaut | బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రౌత్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. రహస్యంగా కంగనా వివాహం చేసుకుందనే ప్రచారం రోజంతా వైరల్‌గా మారి అభిమానుల్లో చర్చకు దారితీసింది. అయితే ఈ వార్తలపై స్వయంగా కంగనా స్పందిస్తూ అసలు విషయాన్ని వెల్లడించారు
Kangana Ranaut | బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రౌత్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. రహస్యంగా కంగనా వివాహం చేసుకుందనే ప్రచారం రోజంతా వైరల్‌గా మారి అభిమానుల్లో చర్చకు దారితీసింది. అయితే ఈ వార్తలపై స్వయంగా కంగనా స్పందిస్తూ అసలు విషయాన్ని వెల్లడించారు.ఈ ప్రచారం మొదలవడానికి కారణం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఫోటోలు. ఆ ఫోటోల్లో కంగనా మెడలో మంగళసూత్రం, చేతులకు ఆకుపచ్చ గాజులు ధరించి కనిపించారు. సంప్రదాయంగా వివాహిత మహిళలు ధరించే ఆభరణాలతో కనిపించడంతో, ఆమె సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
ఈ పుకార్లపై కంగనా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించారు. తనపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇస్తూ, ప్రస్తుతం తాను షూటింగ్లో పాల్గొంటున్నానని వివరించారు. సినిమాలో పోషిస్తున్న పాత్ర కోసం వివాహిత మహిళ గెటప్‌లో ఉన్న సమయంలో ఎవరో తనకు తెలియకుండా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారని చెప్పారు. తాను ఆ పాత్ర కోసం మంగళసూత్రం, గాజులు ధరించానని, ఆ ఫోటోలు బయటకు రావడంతో వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారని, తాను రహస్యంగా వివాహం చేసుకుందా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. కేవలం ఒక పాత్ర గెటప్ చూసి ఇంత పెద్ద చర్చ చేయడం ఆశ్చర్యంగా ఉందని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా తాను ఎవరినీ రహస్యంగా వివాహం చేసుకోలేదని, అలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పెళ్లి పుకార్లకు ఆమె పూర్తి స్థాయిలో చెక్ పెట్టినట్లైంది.ఇటీవలే కంగనా పేరు రాజకీయ నాయకుడు చిరాగ్ పాశ్వాన్‌తో కలిసి వార్తల్లోకి వచ్చింది. ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందనే ప్రచారం రావడంతో కంగనా గతంలోనే స్పందించారు. చిరాగ్ తనకు మంచి స్నేహితుడని, ఇద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్ లేదని ఆమె స్పష్టం చేశారు. కంగనా, చిరాగ్ ఇద్దరూ కలిసి మిలే నా మిలే హమ్ సినిమాలో నటించారు. ఆ సినిమా ద్వారా చిరాగ్ నటుడిగా పరిచయం కాగా, కంగనా కథానాయికగా నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

