Director Puri Jagannadh | డబుల్ ఇస్మార్ట్‌తో స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ మళ్లీ కంబ్యాక్ ఇస్తాడని అటూ అతడి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడమే కాకుండా పూరీ కెరీర్లో అతిపెద్ద డిజాస్టార్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా అనంతరం పూరి జగన్నాథ్ పని అయిపోయిందని.. అతడి కథలు మరి యుత్‌ని కాదు కాదా అసలు ఏ జానర్ ప్రేక్షకులను ఆకట్టుకోవట్లేదని టాక్ వినిపిస్తుంది. అయితే డబుల్ ఇస్మార్ట్ వంటి ఫ్లాప్ తర్వాత పూరి ప్రస్తుతం తన కొత్త కథ కోసం హీరోని వెతికే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలోనే పూరికి అక్కినేని ఫ్యామిలీ నుంచి కబురు వచ్చినట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా అక్కినేని హీరోలకు హిట్లు లేదనే విషయం తెలిసిందే. ఈ ఏడాది నాగార్జున నా సామి రంగా అంటూ వచ్చిన బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. నాగ చైతన్య కూడా కస్టడీ సినిమాతో అట్టర్ ఫ్లాప్‌ను అందుకున్నాడు. ఇక అఖిల్ గురించి చెప్పాల్సిన పని లేదు. అసలు హిట్ అంటే ఎంటో తెలికుండా తొమ్మిదేళ్ల నుంచి కష్టపడుతున్నాడు. అయితే తాజాగా అక్కినేని కాంపౌండ్ నుంచి పూరికి కాల్ వెళ్లినట్లు తెలుస్తుంది. అది అఖిల్ కోసమా లేదా నాగ్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే నాగ్‌కి శివమణి, సూపర్ వంటి సూపర్ హిట్లు ఇచ్చిన పూరి మరోసారి నాగ్‌తో జతకడితే చూడాలనిఉందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కాగా దీనిపై త్వరలోనే అప్డేట్ రానుంది.