Puri Jagannadh | సినీ పరిశ్రమలో సెంటిమెంట్స్తోపాటు ఇగోలు కూడా ఎక్కువే. సెంటిమెంట్స్ అంటే ఆప్యాయత, అనురాగాలు అనుకుంటే పొరపడినట్లే.. ఫలానా తేదీ, నెల, కాంబినేషన్, ముహుర్తం ఇలా వాళ్లకు కలిసొచ్చే రోజు, విషయం. ఇక ఇగోల విషయానికొస్తే.. బయటికి కనిపించరు కానీ అందరిలోనూ పోటీతత్వం ఎక్కువే. ఆ హీరో, దర్శకుడు హిట్ కొట్టితే.. మనం దానికి మించిన హిట్ కొట్టాలి..ఇక్కడి వరకు ఫర్వాలేదు.. ఇది ఆరోగ్యకరమైన పోటీ కిందికి వస్తుంది.
అయితే హీరో కంటే ముందు సెట్స్‌కు నేను ఎందుకు రావాలి అనే హీరోయిన్ ఇగో, దర్శకుడికి, హీరోకు మధ్య క్రియేటివ్ ఇగో.. అలాగే దర్శకుడు, దర్శకుడు మధ్య ఇగో..సో.. ఇలాంటి ఇగోనే పూరి (Puri Jagannadh)కి అడ్డొచ్చింది కాబోలు.. సాధారణంగానే దర్శకుడు పూరి జగన్నాథ్ మనస్తత్వం చాలా టిపికల్. ఆయనకు స్వభిమానం ఎక్కువే. ఆయన పాడ్‌కాస్ట్ విన్నవాళ్లకు ఈ విషయం అర్థమవుతుంది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ చిత్రం డిజాస్టర్ అయిన తరువాత ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) పూరికి ఫోన్ చేసి.. మీలాంటి దర్శకుడికి అపజయం రాకూడదు. నాకు చాలా బాధగా వుంది. మీ తదుపరి చిత్రం కథ నాకు చెప్పండి.. ఏమైనా నా వంతు సలహాలు వుండే ఇస్తాను’ అని చెప్పాడట. అయితే లైగర్ తరువాత పూరి జగన్నాథ్ రామ్‌తో డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో పూరి జగన్నాథ్ ఈ విషయం గురించి చెప్పాడు.
అయితే డబుల్ ఇస్మార్ట్ కథ మాత్రం ఆయన రచయిత విజయేంద్రప్రసాద్‌కు చెప్పలేదు. ఇక్కడే పూరి మనస్సు అంగీకరించలేదు. తన మనస్తత్వానికి విరుద్దంగా ఆయన ఆ పని చేయలేదు. అయితే ఇడియట్, అమ్మనాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు తీసిన పూరి ఇంకొకరి కథ చెప్పి కరెక్షన్స్ తీసుకునే అవసరం వుందా? అని ఆలోచిస్తే లేదనే చెప్పాలి.. ఎందుకంటే మరో బ్లాక్‌బస్టర్స్ వస్తే ఈక్వేషన్స్ అన్ని మారిపోతాయి.. ఈ విషయంలో పూరి డిసిషన్ కరెక్టేనని అంటున్నారు ఆయన సన్నిహితులు.
Nayanthara | మహారాజ డైరెక్టర్‌తో నయనతార.. సినిమా టైటిల్ ఇదే
Gabbar Singh 4K | గబ్బర్ సింగ్‌తో అదే ట్రెండ్ సెట్ చేయబోతున్న పవన్ కల్యాణ్..!
Kanguva Trailer | సూర్య, బాబీడియోల్ రౌద్రరూపం.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న కంగువ ట్రైలర్
Abhishek Bachchan | ఐశ్వర్యారాయ్‌తో విడాకులు.. అభిషేక్ బచ్చన్ రియాక్షన్ ఇదే…!