తమిళ అగ్రనటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ ఓ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘స్లమ్‌డాగ్’ అనే టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్, యానిమల్ వంటి బ్లాక్‌బస్టర్స్‌కి సంగీతాన్ని అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని గురువారం మేకర్స్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
‘యాక్షన్, ఎమోషన్స్, ఎలివేషన్స్ కలగలిసిన న్యూ జనరేషన్ మ్యూజిక్‌ని ఎక్స్పీరియన్స్ చేసేందుకు అందరూ సిద్ధంగా ఉండండి.’ అంటూ ఈ సందర్భంగా మేకర్స్ పేర్కొన్నారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, విజయ్‌కుమార్ కీలక పాత్రధారులు. బ్రహ్మాజీ, వీటీవీ గణేశ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు: పూరీ జగన్నాథ్, జె.బి.నారాయణరావు కొండ్రోల్లా, చార్మికౌర్, నిర్మాణం: పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్.