శ్రీనందు, యామిని భాస్కర్ జంటగా వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘సైక్ సిద్ధార్థ’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో శ్రీనందు మాట్లాడుతూ..విడుదలైన అన్ని కేంద్రాల్లో సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, నటుడిగా ఇలాంటి హిట్ కోసం 18ఏండ్లు ఎదురుచూశానని, అందుకు తగిన ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు.
సినిమాలో తాను పోషించిన శ్రావ్య పాత్రకు అందరూ కనెక్ట్ అవుతున్నారని కథానాయిక యామిని భాస్కర్ చెప్పింది. సిద్ధార్థ పాత్ర యువతతో పాటు మాస్కు బాగా రీచ్ అయిందని, ప్రేక్షకులు తెరపై ఓ జీవితాన్ని చూస్తున్న అనుభూతికిలోనవుతున్నారని దర్శకుడు వరుణ్ రెడ్డి చెప్పారు. ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇదని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డి పేర్కొన్నారు.