Katragadda | తెలుగు చలన చిత్ర రంగంలో దిగ్గజ దర్శకులు కే విశ్వనాథ్, దాసరి నారాయణ రావు, కే రాఘవేంద్రరావు, జంద్యాల వంటి వారితో కలిసి కాట్రగడ్డ మురారి పని చేశారు. అతి కొద్ది సినిమాలు నిర్మించినా.. ఇప్పటికీ అవి క్లాసికల్ సినిమాలుగానే నిలిచాయి. తెలుగు చలన చిత్ర నిర్మాతల గురించి భావి తరాలకు తెలిపేందుకు ‘తెలుగు చలన చిత్ర నిర్మాతల చరిత్ర’ అనే పుస్తకం రాయడంలో కాట్రగడ్డ మురారీ కీలక భూమిక వహించారు.
‘సీతా మహాలక్ష్మి’, ‘గోరింటాకు’, ‘త్రిశూలం’, ‘సీతారామ కల్యాణం’, ‘జానకి రాముడు’, ‘శ్రీనివాస కల్యాణం’, ‘జేగంటలు’, ‘నారి నారి నడుమ మురారి’, ‘అభిమన్యుడు’ వంటి సినిమాలను తన సొంత యువ చిత్ర బ్యానర్‌పైనే కాట్రగడ్డ మురారి నిర్మించారు. ఆయన సినిమాలకు దిగ్గజ సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ మాత్రమే సంగీతం అందించేవారు.