Pawan Kalyan | డిప్యూటీ సీఎం డేట్స్ కోసం నిర్మాతలు వెయిటింగ్..!
పవన్‌కళ్యాన్ హీరోగా మొదలుపెట్టి షూటింగ్‌లు మధ్యలో ఆగిపోయిన సినిమాలు ఆయన పూర్తిచేయాల్సి వుంది. ఈ చిత్ర నిర్మాతలు ఆలెడ్రీ పవన్ సంప్రదించడం మొదలుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమితో జతకట్టి ఎన్నికల్లో సంచలన విజయం సాధించారు పవన్‌కళ్యాణ్. జనసేన బరిలో నిలిచిన 21 స్థానాలకు గాను 21 స్థానాలు గెలిచి చరిత్రను తిరగరాశాడు జనసేన అధ్యక్షుడు. చంద్రబాబు నాయుడు గెలుపులో కీలక పాత్ర వహించిన ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పదవి వరించింది. అయితే ఇక అప్పటినుండి పవన్ కళ్యాన్ డీప్యూటి సీఎం హోదాలో ప్రజాసేవలోనే నిమగ్నమయ్యాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పరిష్కారించాల్సిన సమస్యలపై దృష్టి సారించాడు.
అయితే ఇటు సినిమాల్లో పవన్‌కళ్యాన్ హీరోగా మొదలుపెట్టి షూటింగ్‌లు మధ్యలో ఆగిపోయిన సినిమాలు ఆయన పూర్తిచేయాల్సి వుంది. ఈ చిత్ర నిర్మాతలు ఆలెడ్రీ పవన్ సంప్రదించడం మొదలుపెట్టారు. ఇందులో హరి హర వీర మల్లు చిత్రం ఒకటి. ఈ చిత్రం షూటింగ్ ఎనభై శాతం పూర్తిచేసుకుంది. బ్యాలెన్స్ వర్క్ పార్ట్ కోసం నిర్మాత ఎ.ఎం. రత్నం పనన్ డేట్స్‌ను కోరుతున్నాడు. కేవలం ఒక పది రోజులు డేట్స్కేటాయిస్తే పవన్‌కల్యాణ్ పార్ట్ షూటింగ్ పూర్తి అవుతుంది.
దీంతో పాటు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీని చిత్రం షూటింగ్‌ను కూడా పవన్‌కళ్యాన్ పూర్తి చేయాల్సింది. ఈ సంవత్సరమే పవన్ అభిమానులకు ఆ సినిమాను చూపించాలనే ఉత్సాహాంతో వున్నారు సుజిత్. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాతక్మంగా రూపొందనున్న ఉస్తాద్ గబ్బర్‌సింగ్ ఓ రెండు షెడ్యూల్స్‌ను మాత్రమే పూర్తిచేసుకుంది. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ బిజీని అర్థం చేసుకుని ఈ లోపుగా రవితేజతో మిస్టర్ బచ్చన్ కూడా పూర్తిచేశాడు.
సో పవన్‌కళ్యాణ్ ఏపీ సమస్యలు పరిష్కరించే దిశలో వున్నారు. రాజకీయాల్లో బిజీగా వున్న పవన్‌ను డేట్స్ ఎలా అడగాలో తెలియక సతమతమవుతున్నారు. అయితే పవన్ మాత్రం తానే వీలు చూసుకుని షూటింగ్ చేద్దామనే చెప్పినట్లు తెలిసింది. నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.
Read Also :
Mega Hero | వరుసగా ఫ్లాప్ దర్శకులతో సినిమాలు చేస్తున్న మెగా హీరో.. ఎవరంటే?
Kodi Ramakrishna | దిగ్గజ్జ దర్శకుడు కోడి రామకృష్ణను స్మరించుకోవాల్సిన సందర్భమిది..
Balakrishna | యాక్షన్ మోడ్‌లో బాలయ్య.. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఎన్టీకే 109
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

