Mega Hero | వరుసగా ఫ్లాప్ దర్శకులతో సినిమాలు చేస్తున్న మెగా హీరో.. ఎవరంటే?
‘ముకుంద’ చిత్రంతో హీరోగా అరంగ్రేటం చేశాడు మెగా హీరో (Mega Hero) కొణిదెల వరుణ్‌తేజ్... ఆ తరువాత తొలిప్రేమ, ఫిదా వంటి విజయాలతో యూత్‌లో మంచి క్రేజ్‌ను తెచ్చుకున్నాడు. ఇక గద్దల కొండ గణేష్‌తో మాస్ హీరో అనిపించుకున్న ఈ కొణిదెల వారసుడు ఎఫ్-2, ఎఫ్-3 చిత్రాలతో మంచి కామెడీ టైమింగ్ వున్న హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు.
‘ముకుంద’ చిత్రంతో హీరోగా అరంగ్రేటం చేశాడు మెగా హీరో (Mega Hero) కొణిదెల వరుణ్‌తేజ్… ఆ తరువాత తొలిప్రేమ, ఫిదా వంటి విజయాలతో యూత్‌లో మంచి క్రేజ్‌ను తెచ్చుకున్నాడు. ఇక గద్దల కొండ గణేష్‌తో మాస్ హీరో అనిపించుకున్న ఈ కొణిదెల వారసుడు ఎఫ్-2, ఎఫ్-3 చిత్రాలతో మంచి కామెడీ టైమింగ్ వున్న హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో వరుణ్‌తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్, గాండీవధారి అర్జున చిత్రాలు బిగ్గెస్ట్ ఫ్లాప్ చిత్రాలుగా నిలిచాయి. అయితే ఇప్పటి వరకు అతని కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అంటూ ఏమీ లేదు.
దీంతోపాటు వరుస ఫ్లాప్‌ల తరువాత కూడా ఈ హీరో ఇటీవల ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన దర్శకుల సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆశ్చర్యంగా వుంది. ప్రస్తుతం పలాస దర్శకుడు కరుణ్‌కుమార్ దర్శకత్వంలో మట్కా పేరుతో ఓ సినిమాలో నటిస్తున్నాడు వరుణ్. ఇటీవల శ్రీదేవి సోడా సెంటర్ వంటి డిజాస్టర్ సినిమాను రూపొందించాడు కరుణ్‌కుమార్. దీంతో పాటు వరుణ్ మరో రెండు సినిమాలు అంగీకరించాడు. రవితేజతో టచ్ చేసి చూడు వంటి ఫ్లాప్ సినిమాను తెరకెక్కించిన విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఓ చిత్రంతో పాటు నితిన్‌తో మ్యాస్ట్రో చిత్రంతో పాటు లైక్ అండ్ షేర్ వంటి ఫ్లాప్ చిత్రాలను రూపొందించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించారు.
గత మూడేండ్లలో ఎలాంటి హిట్లు లేని దర్శకులతో వరుణ్ వరుస సినిమాలు చేయడం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోలు సక్సెస్ చుట్టు తిరుగుతుంటారు. సక్సెస్ఫుల్ దర్శకుల సినిమాల్లో నటించడానికే అంగీకరిస్తారు. అయితే వరుణ్ కమిట్మెంట్స్ కూసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే వరుణ్ స్ట్రాజటీ ఏమిటో ఆయనకే తెలియాలి. ఒకటి, రెండు ఫ్లాప్‌లతోనే వారి ప్రతిభను అంచనా వేయకూడదనే లాజిక్‌ను వరుణ్ ఫాలో అవుతున్నాడు కాబోలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

