TG Vishwaprasad | పవన్ కల్యాణ్ విక్టరీ సెలబ్రేషన్స్‌లో టీజీ విశ్వప్రసాద్ అండ్ టీం
TG Vishwaprasad | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను టాలీవుడ్ నిర్మాతలు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో కలిశారని తెలిసిందే. వీరంతా సినీ పరిశ్రమ తరపున పవన్ కల్యాణ్‌ను అభినందించారు. కాగా పవన్ కల్యాణ్‌ను కలిసిన వారిలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwaprasad) కూడా ఉన్నారు.
TG Vishwaprasad | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను టాలీవుడ్ నిర్మాతలు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో కలిశారని తెలిసిందే. వీరంతా సినీ పరిశ్రమ తరపున పవన్ కల్యాణ్‌ను అభినందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తోపాటు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదరప్రసాద్, నిర్మాతలు అల్లు అరవింద్, సి అశ్వినీదత్, ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాగా పవన్ కల్యాణ్‌ను కలిసిన వారిలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ (TG Vishwaprasad) కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు నగరంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో పవన్ కల్యాణ్ గ్రాండ్ విక్టరీ వేడుకలను కూడా నిర్వహించారు టీజీ విశ్వప్రసాద్. ఏపీ ఎన్నికల్లో కూటమి విక్టరీ విజయం సాధించడం కోసం కష్టపడ్డవారిని కూడా ఆయన సత్కరించడం విశేషం.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మారుతి, శ్రీవాస్, శ్రీరామ్ ఆదిత్య, నిర్మాత ఎస్కేఎన్, దామోదర ప్రసాద్, నటులు బాలాదిత్య, సప్తగిరి, హైపర్ ఆదితోపాటు ఆర్పీ పట్నాయక్, రామజోగయ్య శాస్త్రి ఉన్నారు. యువహీరోలతోపాటు స్టార్ యాక్టర్లతో సినిమాలు చేస్తూ నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు టీజీ విశ్వప్రసాద్. ఆయన సారథ్యంలో సక్సెస్‌ఫుల్‌గా వన్ ఆఫ్ ది లీడింగ్ బ్యానర్‌గా కొనసాగుతోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
ఈవెంట్లో ఇలా..
It’s an historic and spectacular win and wanted to take a moment to celebrate the victory with our team. pic.twitter.com/M9DkyRoQHk
— People Media Factory (@peoplemediafcy) June 24, 2024
Appreciations and Congratulations galore from the beloved celebrities for our producer @vishwaprasadtg garu at People Celebrations event. pic.twitter.com/BtuO42eLPU
— People Media Factory (@peoplemediafcy) June 25, 2024
Our Producer @vishwaprasadtg Garu, along with other prominent producers from TFI, had the honor of meeting the Honorable AP Deputy Chief Minister Shri @PawanKalyan Garu. We congratulated him on his electoral achievement and conveyed our best wishes for an outstanding term in… pic.twitter.com/GGEJr4vB7G
— People Media Factory (@peoplemediafcy) June 24, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

