అగ్ర నటుడు చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇదిలావుండగా ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే అధికారిక ప్రకటన వెలువడింది. ఫస్ట్‌లుక్ పోస్టర్ సైతం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారు.
పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా కథాంశం గురించి ఆసక్తికరమైన వార్తలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించబోతున్నారని, చిరంజీవి పాత్ర శక్తివంతంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి సరికొత్త మేకోవర్‌కు సిద్ధమవుతున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ‘విశ్వంభర’ విడుదల అనంతరం సెట్స్‌మీదకు వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.