Dhanush | సాధారణ బస్కండక్టర్గా జీవితాన్ని ప్రారంభించి సూపర్‌స్టార్‌గా ఎదిగారు రజనీకాంత్. ఆయన స్ఫూర్తిదాయక జీవితం వెండితెర దృశ్యమానం కానుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలా రజనీకాంత్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెట్స్‌మీదకు తీసుకురానున్నట్లు తెలిసింది. రజనీకాంత్ పాత్రలో ధనుష్ నటించనున్నారని వార్తలొస్తున్నాయి. ఇటీవల రజనీకాంత్‌తో తీయించుకున్న ఓ ఫొటోను నిర్మాత సాజిద్ నడియావాలా తన సోషల్‌మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ బయోపిక్ గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.