Producer Rajesh Danda | నిర్మాతగా నచ్చిన కథల్ని ఎంచుకోవచ్చు!
తెలుగు చిత్రసీమలో విజయవంతమైన డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్నారు రాజేశ్ దండా. హాస్య మూవీస్ బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం సందీప్‌కిషన్ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ‘ఊరు పేరు భైరవకోన’, శ్రీవిష్ణుతో ‘సామజవరగమన’ చిత్రాల్ని నిర్మిస్తున్నారాయన.
తెలుగు చిత్రసీమలో విజయవంతమైన డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్నారు రాజేశ్ దండా. హాస్య మూవీస్ బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం సందీప్‌కిషన్ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ‘ఊరు పేరు భైరవకోన’, శ్రీవిష్ణుతో ‘సామజవరగమన’ చిత్రాల్ని నిర్మిస్తున్నారాయన. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేశ్ దండా మాట్లాడుతూ “ఊరు పేరు భైరవకోన’ సూపర్ నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్. గ్రాఫిక్స్ హంగులతో మెప్పిస్తుంది. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. జూలై లేదా ఆగస్ట్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం. ఇక ‘సామజవరగమన’ చక్కటి కుటుంబ కథా చిత్రం. ఆద్యంతం వినోదప్రధానంగా ఆకట్టుకుంటుంది.
శ్రీవిష్ణు ఇప్పటివరకు ఈ తరహా కథ చేయలేదు. నా వ్యక్తిగత అభిప్రాయంలో డిస్ట్రిబ్యూషన్ కంటే సినిమా ప్రొడక్షనే బాగుంది. మన మనసుకు నచ్చిన కథల్ని ఎంపిక చేసుకొని సినిమాలు చేసే వీలుంటుంది. అయితే డిస్ట్రిబ్యూటర్‌గా ఒక ఏడాదిలో పది సినిమాలు చేసి ఎనిమిది విజయాలు సొంతం చేసుకున్నా. మా సంస్థ రూపొందించిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ కమర్షియల్‌గా ఆశించిన విజయం సాధించలేకపోయినా, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆగస్ట్‌లో నరేష్‌తో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నా. సుబ్బు దర్శకత్వం వహిస్తారు. అలాగే శ్రీవిష్ణుతో మరో సినిమా చర్చల దశలో ఉంది. సాయిధరమ్‌తేజ్ నాకు చాలా ఇష్టమైన హీరో. ఆయనతో సినిమా చేయాలనుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

