Vijay Devarakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ ఏడాది మే 30న విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం పలు కారణాల వలన వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను జూలై 31న తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. అయితే ఈ సినిమాను హిందీలో విడుదల చేయట్లేదని రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించాడు నిర్మాత నాగవంశీ. కింగ్డమ్ చిత్రం జూలై 30న తెలుగుతో పాటు తమిళం హిందీ భాషల్లో విడుదల కాబోతుందని సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌ని నమ్మకండంటూ తెలిపాడు. ప్రస్తుతం హిందీలో ఈ సినిమా టైటిల్ వివాదంలో ఉందని త్వరలోనే కొత్త టైటిల్‌తో రాబోతున్నట్లు తెలిపాడు.
కింగ్డమ్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నది. సత్యదేవ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్ర మ్యూజిక్ అందిస్తున్నాడు.
#KINGDOM is releasing in Hindi.#KingdomOnJuly31st pic.twitter.com/f4z1bzy0HG
— Suresh PRO (@SureshPRO_) July 15, 2025