టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులు ఎప్పుడెపుడా అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి భీమ్లా నాయక్ (Bheemla Nayak). పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తోన్న ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కొషియమ్కు రీమేక్. పవన్ టైటిల్ రోల్ పోషిస్తుండగా..డానియల్ శేఖర్‌గా రానా నటిస్తున్నాడు. కోలీవుడ్ భామ నిత్యమీనన్, మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ ఫీ మేల్‌లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ప్రస్తుతం భీమ్లా నాయక్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీం. ఆదివారం మధ్యాహ్నం చిత్ర నిర్మాత నాగవంశీ (Naga Vamsi) స్టూడియోలో తీసిన ఓ స్టిల్‌ను ట్విటర్ ద్వారా షేర్ చేశాడు. గ్లింప్స్ వీడియో నుంచి పవన్ స్నాప్ చాట్ ఒకటి పోస్ట్ చేసి, “ఈ సారి కూడా మిస్ అవ్వొద్దు..12 జనవరి 2022న థియేటర్లలో కలుద్దాం..ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి..” అంటూ క్యాప్షన్ పెట్టాడు నాగవంశీ.
REMEMBER THE WORD!
— Naga Vamsi (@vamsi84) November 21, 2021
Eesari kooda miss avvadu…See you in theatres – 12 Jan 2022! 🔥#BheemlaNayak pic.twitter.com/Ny6e3bzvmG
అయితే భీమ్లానాయక్ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటుందన్న వార్తలకు తాజా ట్వీట్‌తో ఫుల్ స్టాప్ పెట్టాడు నిర్మాత వంశీ. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్..కాగా సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
TJ Gnanavel Apology | క్షమాపణలు చెప్పిన జైభీమ్ డైరెక్టర్..!
Karthikeya Lohita marriage | గ్రాండ్‌గా హీరో కార్తికేయ వివాహం..పెళ్లి వేడుక వీడియో
Akhanda New Poster Update | బాలకృష్ణ, ప్రగ్యాజైశ్వాల్ షికారు..కొత్త పోస్టర్ అదిరింది
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్