Sithara Entertainments | పవర్ కళ్యాణ్ పాతిక మైల్‌స్టోన్‌గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి ఎంత పెద్ద డిజాస్టరో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా పేరెత్తితేనే అభిమానులకు చలిజ్వరం పుట్టుకొస్తుంది. ఇక సినిమా చూస్తున్న టైమ్‌లో అస్సలు ఇది త్రివిక్రమ్ సినిమానేనా అన్న డౌట్ ప్రతీ ఒక్కరి మైండ్‌లో మెదిలింది. అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడి నుంచి ఇంత నాసీరకమైన సినిమా రావడం అందిరినీ షాక్‌కు గురిచేసింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ నటన కూడా ఫ్యాన్స్‌ను కొసమెరుపు కూడా ఆకట్టుకోలేదు. అనిరుధ్ వంటి సంగీత మాయ జాలాన్ని దింపిన ఆయన కూడా సినిమాను కాపాడలేక పోయాడు.
ఇక ఈ సినిమా నిర్మాతలకు తెచ్చిపెట్టిన నష్టాలు అన్నీ ఇన్నీ కాదు. దాదాపు పది సినిమాలకు వచ్చిన లాభాలు ఈ ఒక్క సినిమాతో వెళ్లిపోయానని అప్పట్లో టాలీవుడ్లో కోడై కూసింది. కాగా తాజాగా దీనిపై నాగవంశీ స్పందించాడు. అజ్ఞాతవాసి సినిమా అంధకారంలో పడేసిందని, సినిమా పోయాక ఆ బాధలోనే టీమ్ రెండు నెలలు గడిపేశామని, జనవరిలో రిలీజై ఫలితం చూశాక ఎవరికీ ఏం జరిగిందో అంతు చిక్కని పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు. అదే టైమ్‌లో తారక్ కలిసి ధైర్యాన్ని చెప్పాడని, ఇదే ఏడాది మనం బ్లాక్ బస్టర్ హిట్టు కొడుతున్నామని అరవింద సమేత వీర రాఘవ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పాడు.
త్రివిక్రమ్ సైతం పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ పూర్తి చేసి దసరా బరిలో దింపాడు. పైగా పోటీగా ఏ సినిమా లేకపోవడంతో యునానిమస్‌గా ఈ సినిమా బంపర్ హిట్టు కొట్టింది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.165 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి త్రివిక్రమ్‌కు మాస్ కంబ్యాక్ అయింది.