Daaku Maharaaj | నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్(Daaku Maharaaj). ఈ సినిమాకు వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ(Naga Vamsi), సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇందులో నిర్మాత నాగవంశీతో పాటు దర్శకుడు బాబీ, హీరోయిన్లు ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాల్గోన్నారు.
అయితే తెలంగాణలో ఈ సినిమా టికెట్ల రేట్లకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు నాగవంశీ. ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం మాకు సినిమాకు టికెట్ రేట్లు పెంచిందని.. అయితే తెలంగాణలో మాత్రం టికెట్ రేట్లు పెంచమని అడిగే ఉద్దేశం తమకు లేదని తేల్చి చెప్పారు. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను రాయలసీమలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు తెలిపారు.
ఇదిలావుంటే ఈ సినిమాకు ఏపీలో టికెట్లు రేట్ల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకి ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఉదయం నాలుగు గంటల నుంచి బెనిఫిట్ షోలకు అనుమతినిస్తూ.. ప్రీమియర్ షో టికెట్ ధరలను రూ.500(జీఎస్టీతో కలిపి)గా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే విడుదలైన మొదటిరోజు నుంచి జనవరి 25 వరకు రోజుకు ఐదు షోలకు అనుమతి ఇచ్చింది. ఈ షోలకు మల్టీప్లెక్సుల్లో టికెట్‌పై రూ.135, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.110 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read..