తెలుగు ప్రేక్షకులు (Telugu Audience) చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రాల్లో టాప్ ప్లేస్‌లో ఉంటాయి భీమ్లా నాయక్ (Bheemla Nayak), ఆడవాళ్లు మీకు జోహార్లు (Adavallu Meeku Joharlu). ఈ రెండు మోస్ట్ ఎవెయిటెడ్ చిత్రాలు ఒకే తేదీన అంటే ఫిబ్రవరి 25న విడుదల కాబోతున్నాయి. శర్వానంద్ (Sharwanand), కిశోర్ తిరుమల కాంబోలో వస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రానికి సంబంధించిన డిస్కషన్ ఒకటి టాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. భీమ్లా నాయక్ ఈ నెలలో విడుదల కాదని అంతా అనుకున్నారు. కానీ నిర్మాత నాగవంశి (Naga Vamshi)ఆడవాళ్లు మీకు జోహార్లు విడుదలవుతున్న తేదీనే ఫైనల్ చేశాడు.
భీమ్లానాయక్ చిత్రాన్ని సోలోగా విడుదల చేయాలని ఫిక్సయిన నాగవంశి ఓవర్సీస్, గుంటూరు, వెస్ట్ , ఈస్ట్ పంపిణీ హక్కులను తన స్నేహితులకు విక్రయించాడు. అయితే ఇదే రోజు సుధాకర్ నిర్మిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు కూడా విడుదలవుతుండటంతో ఆయా ప్రాంతాల్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి సహకారం అందడం లేదట. భీమ్లా నాయక్ విషయంలో నాగవంశి ముందే మాస్టర్ ప్లాన్ వేశాడట.
శర్వానంద్‌తో తెరకెక్కించిన రణరంగం చిత్రానికి నాగవంశి రూ.8 కోట్లు నష్టపోయాడని ఇన్సైడ్ టాక్..కాగా అప్పటి నుంచి శర్వానంద్‌తో నాగవంశి దూరాన్ని మెయింటైన్ చేస్తున్నాడట. ఇక ఇపుడుమాత్రం బంతి నాగ వంశీ కోర్టులో ఉండటంతో మరి డిస్ట్రబ్యూటర్ల సహకారం లేకుండానే శర్వానంద్ నిర్మాత సుధాకర్ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేస్తాడా..? లేదంటే వాయిదా ఏమైనా వేస్తాడా..? అంటూ ఇపుడు తెగ చర్చ నడుస్తోంది.