Dil Raju | నిర్మాత దిల్ రాజు అల్లుడి పోర్షే కారు మాయం.. ఎత్తుకెళ్లింది ఎవరో తెలుసా?
ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) అల్లుడికి చెందిన పోర్షే కారు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అపహరణకు గురయింది. దిల్‌రాజ్ అల్లుడు అర్చిత్ రెడ్డి (Archith Reddy) జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌కు (Daspalla Hotel) రూ.1.7కోట్ల విలువైన తన పోర్షే కారులో (Porsche car) శుక్రవారం ఉదయం వెళ్లారు.
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) అల్లుడికి చెందిన పోర్షే కారు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అపహరణకు గురయింది. దిల్‌రాజ్ అల్లుడు అర్చిత్ రెడ్డి (Archith Reddy) జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌కు (Daspalla Hotel) రూ.1.7కోట్ల విలువైన తన పోర్షే కారులో (Porsche car) శుక్రవారం ఉదయం వెళ్లారు. కారును హోటల్ వద్ద నిలిపి లోపలికి వెళ్లి తిరిగి రాగా కారు కనిపించలేదు. దీంతో ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కారు సిగ్నల్ జంప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే కేబీఆర్ పార్క్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే నిందితుడిని మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌గా గుర్తించారు. తాను రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ వ్యక్తిగత సహాయకుడినని, కేటీఆర్ కారు తీసుకెళ్లాలని సూచించారని, తన సహాయకుడు హృతిక్‌రోషన్‌తో కలిసి కారులో అకాశ్ అంబానీని కలవడానికి వెళ్తున్నానని చెప్పాడు. కాగా, అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా మతిస్థిమితం లేదని, బ్రైట్ లైఫ్ ఫౌండేషన్ సంస్థలో చికిత్స పొందినట్లు చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

