గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఏ విషయంలో అయిన చాలా ఓపెన్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు ముక్కు సూటిగా సమాధానాలు ఇస్తుంటుంది. కొద్ది రోజులుగా నెటిజన్స్ ప్రియాంక శరీరాకృతిపై ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. వయస్సు అయిపోతుందని, ఇంతక ముందులా ప్రియాంక లేదని కామెంట్స్ పెడుతున్నారు. వీటిపై యాహు లైఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
నా వయస్సు పెరగుతుంది. నా శరీరంలో మార్పులు వస్తున్న విషయాన్ని నేను ఒప్పుకుంటాను. ఈ మార్పుల వలన నేను ఇబ్బంది పడటం లేదని అబద్దం చెప్పలేను. మార్పలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. నటిగా శరీరంలో మార్పులు వస్తుండడాన్ని జీర్ణించుకోవడం కష్టం. కాని తప్పదు. వయస్సుతో వచ్చే మార్పులను ప్రతి ఒక్కరు స్వీకరించాల్సిందే. నేను అందుకు సిద్ధం. ప్రస్తుతం నా శరీరానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుంటున్నాను అని ప్రియాంక పేర్కొది. 38 ఏళ్ల ప్రియాంక 2018లో తన కన్నా పదేళ్లు చిన్న వాడైన సింగర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హాలీవుడ్ లో టెక్స్ట్ ఫర్ యు
అనే చిత్రంతో పాటు రస్సో బ్రదర్స్ సిటాడెల్ లో.. కీను రీవ్స్ మ్యాట్రిక్స్ 4 లోనూ పీసీ నటిస్తోంది.