Priyanka Jawalkar| స్క్రిప్టు నచ్చితేనే సినిమా ఒప్పుకుంటా: ప్రియాంక జవాల్కర్
టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ (Tollywood) లో అడుగుపెట్టిన తెలుగు బ్యూటీ ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar|). తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుందీ భామ.

టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ (Tollywood) లో అడుగుపెట్టిన తెలుగు బ్యూటీ ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar|). ఇటీవల స్పీడ్ పెంచిన ఈ నాయిక తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాలతో వరుస హిట్స్ అందుకుంది. ఈ రెండు చిత్రాల్లో ప్రియాంక అందం, నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో పాత్రికేయులతో ముచ్చటించింది ప్రియాంక.
ప్రియాంకా జవాల్కర్ ఇంటర్వ్యూ హైలైట్స్ చూస్తే..
నేను కొంత గ్యాప్ తరువాత నటించిన తిమ్మరుసు హిట్ అయ్యిందని అందరూ అన్నారు. ఎస్ఆర్ కల్యాణమండపం సెకండ్ వేవ్ తరువాత ఫస్ట్ హిట్ అంటున్నారు. థియేటర్ కి ప్రేక్షకులు వస్తారా..? రారా..? అనే ఒక డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు థియేటర్స్ కు ఆడియన్స్ విపరీతంగా వస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్ జాగ్రత్తలు పాటిస్తూనే థియేటర్స్ కి వస్తున్నారు. తిమ్మరుసు విడుదల తరువాత గ్లామర్ పై కొంత కేర్ తీసుకొని వెయిట్ లాస్ అయ్యాను. నేనే వంట చేసుకోవడం ప్రారంభించా. టాక్సీవాలా సినిమా తరువాత సెలెక్టెడ్ గా స్క్రిప్ట్స్ ఎంచుకొని మూవీస్ సైన్ చేశాను. గమనం సినిమాలో నా రోల్ చిన్నదే అయినా బాగా నచ్చి ఒప్పుకున్నానని ప్రియాంక జవాల్కర్ చెప్పింది.
నేను నటించిన సినిమాలకు నా ఫ్రెండ్స్ పెద్ద క్రిటిక్స్ అని చెప్పింది ప్రియాంక జవాల్కర్. వాళ్లు నేను ఎక్కడ బాగా చేశాను ఎక్కడ మిస్ అయ్యాను చెబుతుంటారు. డైరెక్టర్ చెప్పినట్లు చెయ్యడమే నా లక్ష్యం, వారి వల్లే నాకు మంచి రోల్స్ వస్తున్నాయి. బయట నామీద వచ్చే నెగిటీవ్ ను లైట్ తీసుకుంటాను. పాజిటివ్ ను మాత్రమే ఎంజాయ్ చేస్తాను. ఇప్పటిదాకా మంచి సినిమాల్లో నటించాను భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి పాత్రల్లో నటించాలని ఉంది. ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాలో సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నా డాన్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని డాన్స్ నేర్చుకుంటున్నాను. తెలుగులో కొన్ని స్క్రిప్ట్స్ విన్నాను త్వరలో ఫైనల్ చేస్తాను. ఓటిటి ఆఫర్స్ వస్తున్నాయి, స్టోరీస్ విన్నాను, కొన్ని ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఇలాంటి పాత్రలే చెయ్యాలని లేదు, నాకు నచ్చిన పాత్ర ఏదైనా చేస్తాను. తమిళ్ లో ఒక సినిమా సైన్ చేశాను. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది ప్రియాంక జవాల్కర్.
ఇవి కూడా చదవండి..
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Mahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

