Priyanka Chopra | బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) గురించి మూవీ లవర్స్‌కు పెద్దగా చెప్పనవసరం లేదు. 2002లో తొలిసారి తమిళ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ బీహారీ సుందరి ఆ తర్వాత తన ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే పెట్టింది. తుఫాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా హాయ్ చెప్పింది. కాగా ఈ బ్యూటీ తన సోదరి, నటి మన్నారా చోప్రా (Mannara chopra)కు బర్త్ డే (Birthday wishes) విషెస్ చెప్తూ.. పోస్ట్ చేసిన త్రోబ్యాక్ స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
లిటిల్ మన్నారా చోప్రా (Bollywood)తో దిగిన త్రోబ్యాక్ స్టిల్‌ను షేర్ చేస్తూ.. గుడ్ లక్ లిటిల్ మన్నారా అంటూ హ్యాపీ మూడ్‌లో ఉన్న ఫొటోతో శుభాకాంక్షలు తెలియజేసింది మన్నారా చోప్రా. ప్రేమా గీమా జాన్తా నై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది మన్నారా చోప్రా. ఆ తర్వాత హిందీ, తమిళం, తెలుగు, పంజాబీ భాషల్లో నటిస్తోంది. ఈ బ్యూటీకి నెటిజన్లు, మూవీ లవర్స్, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత హాలీవుడ్‌కు పరిమితమైన ప్రియాంకా చోప్రా.. బాలీవుడ్ రీఎంట్రీకి రంగం సిద్దం చేసుకున్నట్టు ఇప్పటికే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.
మన్నారాతో ప్రియాంకా చోప్రా త్రోబ్యాక్ స్టిల్…
#PriyankaChopra drops a rare pic with cousin #MannaraChopra ⚡ pic.twitter.com/F7H6UGs75F
— Bollywood Buzz (@BollyTellyBuzz) October 20, 2023