Priyanka Chopra | ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఒకే ఒక్క సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ మరేదో కాదు మహేష్ బాబు- రాజమౌళి చిత్రం. ‘SSMB29’ ప్రాజెక్ట్ ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు, అంతర్జాతీయంగా కూడా హాట్ టాపిక్‌గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ఏ చిన్న అప్డేట్ అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. రాజమౌళి సినిమా అంటేనే భారీ స్థాయి లో ప్రీ-ప్రొడక్షన్, టాప్ లెవల్ యాక్షన్, అద్భుతమైన విజువల్స్ ఉంటాయి. ‘SSMB29’ కూడా ఆ స్థాయిలోనే రూపొందుతోందని ఇండస్ట్రీ టాక్.
ఇప్పటివరకు ఈ సినిమా గురించి అధికారికంగా వివరాలు బయటకు రాలేదు. ఈ చిత్రంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని మాత్రం తెలిసింది. ఇప్పటికే ప్రియాంక పలు షెడ్యూల్స్‌లో పాల్గొంది. అయితే తాజాగా ప్రియాంక చోప్రా ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ఈ ఏడాది ఓ పాన్ ఇండియా ఇండియన్ సినిమాలో నటిస్తున్నాను. ఇండియా సినిమాలు, ఆడియన్స్ ఎంతో మిస్ అవుతున్నాను. మళ్లీ ఇక్కడి ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడం ఎంతో ఆనందంగా ఉంది” అని వ్యాఖ్యానించారు. ఇది విన్న మహేష్ అభిమానులు ఆమె కామెంట్ చేసింది SSMB29 గురించేనని భావిస్తున్నారు. దీంతో ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రియాంక తన బాల్యంలో ఎక్కువగా సినిమాలు చూడలేదని, కానీ మణిరత్నం దర్శకత్వం వహించిన ‘ముంబయి’ తనకు గుర్తుండే ఫస్ట్ మూవీ అని చెప్పారు. “నా 13 ఏళ్ల వయసులో థియేటర్లో ముంబయి సినిమా చూశాను. ఇప్పటికీ ఆ సినిమా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది,” అని చెప్పారు. ఇక SSMB29 విషయానికి వస్తే ఇది అడ్వెంచరల్గా మూవీగా రూపొందుతుంది. జులై రెండో వారంలో కెన్యాలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌కు తమిళ స్టార్ ఆర్ మాధవన్ జాయిన్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని 2027లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.