Priyanka Chopra | మహేష్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో ప్రియాంక చోప్రా కథానాయిక దాదాపుగా ఖరారైట్లు తెలిసింది. ఈ విషయంలో చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా ఈ సినిమా సన్నాహాల్లో బిజీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ప్రియాంకచోప్రాకు 30కోట్ల భారీ పారితోషికం అందించనున్నారని తెలిసింది. ఒకవేళ ఈ వార్తే నిజమైతే..భారతీయ సినిమాలో ఓ కథానాయిక స్వీకరించే అత్యధిక పారితోషికం ఇదే అవుతుంది. ముంబయి మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం..
ఈ సినిమా కోసం ప్రియాంకచోప్రా దాదాపు 50కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. దాదాపు నెలకుపైగా సాగిన చర్చల అనంతరం ప్రియాంకచోప్రా రెమ్యునరేషన్‌ను 30కోట్లకు ఫిక్స్ చేశారట. ఏదిఏమైనా ఈ సినిమా ద్వారా భారతీయ సినిమాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకోబోతున్న కథానాయికగా ప్రియాంకచోప్రా సరకొత్త ఘనతను సాధించబోతున్నది ట్రేడ్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ కథాంశంతో రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో షూటింగ్ జరుగుతున్నది.