సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ప్రియాంక చోప్రా. బాలీవుడ్లో స్టార్ హాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తనదైన ైస్టెల్ డ్రెస్సింగ్‌తో బీటౌన్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే ప్రియాంక.. తాజాగా ఓ ఈవెంట్లో మెరిసి మరోసారి వార్తల్లో నిలిచింది.
అత్యంత ఖరీదైన నెక్లెస్ ధరించిన ప్రియాంక ఆ ఈవెంట్‌కే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. రోమ్‌లో జరిగిన బుల్గారీ 140వ వార్షికోత్సవానికి హాజరైన ముద్దుగుమ్మ బ్రాండ్ క్లాసీ ఆభరణాలను ధరించింది.
ఇప్పుడు ఆమె వజ్రాల కంఠాభరణం గురించి చర్చోపచర్చలు సాగుతున్నాయి. మొత్తం 200 క్యారెట్ల వజ్రాలతో తీర్చిదిద్దిన ఈ వజ్రాల నెక్లెస్ ధర దాదాపు రూ.358 కోట్లని తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. ఆ నెక్లెస్ చేయడానికి దాదాపు 2,800 గంటల సమయం పట్టినట్లు తయారీదారులు చెబుతున్నారు. మొత్తంగా అత్యంత ఖరీదైన వజ్రాల ఆభరణంతో తళుకులీనిన ప్రియాంక సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నది.