Priyanka Chopra | గ్లోబల్ స్టార్ (Global Star) ప్రియాంక చోప్రా (Priyanka Chopra).. ఇండియాలో పరిచయం అక్కర్లేని పేరు ఇది. బాలీవుడ్లో (Bollywood) స్టార్ హీరోయిన్లలో ఒకరైన ప్రియాంక.. ప్రస్తుతం హాలీవుడ్ (Hollywood)లో బిజీబిజీగా గడుపుతోంది. ఇక హాలీవుడ్ సింగర్ నిక్ జొనాస్‌తో పెండ్లి తర్వాత లాస్ఏంజెల్స్ (Los Angeles)లో స్థిరపడిన ఆమె అప్పుడప్పుడు ఇండియాకి వచ్చి వెళ్తుంటారు. అయితే ప్రియాంక చోప్రా ఈ మధ్య ఇండియా వచ్చి చాలా రోజులు అవుతుంది. రీసెంట్గా తన కజిన్ పరిణీతి చోప్రా వివాహానికి కూడా ప్రియాంక హాజరు కాలేదు. ఇదిలా ఉంటే.. తాను ఇండియా వస్తున్నట్లు అభిమానులకు సాలిడ్ అప్డేట్ ఇచ్చింది.
ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుపుతూ.. ఇక ఆగలేను.. ‘వన్ మినిట్ హోగయా ముంబై’ అంటూ ప్రియాంక చోప్రా రాసుకోచ్చింది. దీనితో పాటు పాస్‌పోర్ట్‌ను ఫోటో తీసి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. అక్టోబర్ 27 నుంచి ముంబైలో జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫెస్టివల్‌కు ప్రియాంక చోప్రా అధ్యక్షత వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇందులో భాగంగానే ప్రియాంక ఇండియాకు వస్తున్నట్లు తెలుస్తుంది.

Priyanka Chopra
ప్రియాంక చోప్రా 2012లో ‘ఇన్ మై సిటీ’ (In My City) తో హాలీవుడ్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ పాట హిట్టవ్వడంతో ప్రియాంకకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. 2013లో అమెరికన్ రాపర్ పిట్బుల్తో కలిసి ‘ఎక్సోటిక్’, 2014లో ‘ఐకాంట్ మేక్ యు లవ్ మి’ అనే పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక 2015లో వచ్చిన హాలీవుడ్ టీవీ సిరీస్ (American Broadcasting Company-ABC) క్వాంటికో తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో వయసులో తనకంటే పదేండ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ (Pop Singer) నిక్ జొనాస్ (Nick Jonas)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీయడంతో కొన్నేళ్ల డేటింగ్ అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో 2018లో ఈ జంట ఒక్కటయ్యారు. అనంతరం 2022 ఏడాదిలో సరోగసి ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వివాహమైన తర్వాత నుంచి ఆమె తన భర్త నిక్‌తో కలిసి లాస్ఏంజెల్స్లోనే ఉంటోంది. పలుహాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూనే బాలీవుడ్ సినిమాలు నిర్మిస్తోంది.