Varanasi | సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో పాన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ‘వారణాసి’ టైటిల్ అనౌన్స్మెంట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో గ్రాండ్‌గా జరిగింది. మహేష్ ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌తో జక్కన్న ప్రపంచానికి కొత్త రూపాన్ని పరిచయం చేస్తే, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈవెంట్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. స్టేజ్‌పైకి వచ్చిన ప్రియాంక చోప్రా తెలుగులో “హలో హైదరాబాద్”, “తగలబెట్టేద్దామా?” అంటూ అభిమానులను పలకరించడంతో హాల్ అంతా హర్షధ్వనులతో మార్మోగింది. ఈ క్యూట్ తెలుగు డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈవెంట్ కోసం ప్రత్యేకంగా తెలుగు ప్రాక్టీస్ చేసిన వీడియోను కూడా ఆమె షేర్ చేయగా, ఆ డెడికేషన్‌పై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. “సినిమాలో కంటె లైవ్ స్టేజ్‌పై తెలుగు మాట్లాడడం చాలా కష్టం” అంటూ ప్రియాంక చెప్పిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక డైరీ మెయింటైన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ‘వారణాసి’ చిత్రంలో ప్రియాంకనే హీరోయిన్ అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఆమె ‘మందాకిని’ పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే విడుదలైన ఆమె ఫస్ట్‌లుక్ భారీ హైప్ క్రియేట్ చేస్తుంది. గుహలో దేవతా విగ్రహాల మధ్య చీర కట్టుకుని గన్ పట్టుకుని కనిపించిన మాస్ అవతారం అందరినీ ఆశ్చర్యపరిచింది.
టీజర్లో ప్రత్యేకంగా చూపించిన చిన మస్తానా దేవి టెంపుల్ సన్నివేశం చర్చనీయాంశమైంది. ప్రమాదంలో చిక్కుకున్న ప్రియాంకను హీరో కాపాడే విజువల్స్ థ్రిల్లింగ్‌గా అనిపించాయి. చిన మస్తా దేవి తాంత్రిక పూజల్లో ఆరాధించే రౌద్రరూపం. ముఖ్యంగా టిబెటిన్ తాంత్రిక సంప్రదాయాల్లో ఈ దేవికి ప్రత్యేక స్థానం ఉంది.చిన్న మస్తా, ప్రచండ చండిక, జోగని మా వంటి పేర్లతో కూడా పిలుస్తారు. టీజర్లో ఈ దేవి విగ్రహం చుట్టూ రూపొందించిన సన్నివేశాలు సినిమాకు కీలకం కానున్నాయని తెలుస్తోంది. ఈ పాత్రను రాజమౌళి ఎలా తీర్చిదిద్దారు? ఏ ప్రపంచంలో ఆమె పాత్ర విస్తరించబోతుంది? అనేదానిపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. మహేష్ – రాజమౌళి కాంబినేషన్‌కు తోడు ప్రియాంక చోప్రా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతుండటంతో ‘వారణాసి’పై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి.